గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. 1950లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆయన గీతా ప్రెస్ ట్రస్టులో చేరారు. 40 ఏళ్లుగా ఆయన గీతా ప్రెస్‌కు ధర్మకర్తగా వ్యవహరించారు. నగరంలోని సివిల్ లైన్స్‌లో గల హరిఓంనగర్లో నివాసముంటున్న ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మరణ వార్త విని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.