రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అయిదు గ్యారెంటీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు, గోధన పథకం కింద కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు, కాలేజీ విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు. అలాగే స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారికి రూ.15 లక్షల బీమా అందిస్తామన్నారు.