అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 20వ వార్డు పై తోటలో వాల్మీకి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అందులో భాగంగానే శుక్రవారం రాత్రి డిజె సాంగులతో 200 మంది మహిళలు కలశాలు చేతపట్టి ఊరేగింపు నిర్వహించారు. ప్రభుత్వ విప్ కాపు ముఖ్య అతిథిగా పాల్గొని వాల్మీకి చిత్రపట రథాన్ని స్వయంగా నడిపి అందరినీ ఆకర్షించారు. జై వాల్మీకి అంటూ నినాదాలు చేపట్టారు.