‘నా కంటే నా కొడుకు చదువరి అని నేను గర్వంగా చెప్పగలను’ అని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తన కుమారుడు త్రాగుబోతు కాదు.. భూకబ్జాదారు అంతకన్నా కాదని ఆయన తెలిపారు. ఏ గుమ్మంకైనా నేరుగా వచ్చి వారి సమస్యలు అడిగే ధైర్యం తమకుందని అన్నారు. డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాలంటే తమకు వ్యాపారం కాదన్నారు. రాజారెడ్డితో జైల్‌లో పరిచయం అయిన నాటి నుంచి నేటి వరకూ తన జీవితం వైఎస్ కుటుంబానికి అంకితం అని చెప్పారు. తిరుపతిని ఒక కొత్త తిరుపతిగా మార్చిన ఘనత సీఎం జగనన్నదేనని చెప్పారు. ‘అర్హత గల వాడు అయితేనే నా కుమారుడు అభినయ్‌ని గెలిపించండి’ అని ఓటర్లను ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో సామాజిక సాధికారక బస్సు యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.