గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇజ్రాయెల్ దాడుల వెనుక పాశ్చాత్య దేశాల కుట్ర ఉందని ఆరోపించారు. ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపేయాలని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఏ దేశానికైనా తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని, కానీ ఈ ఘర్షణలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa