ఇజ్రాయెల్‌తో యుద్ధంలో బందీలయిన ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ నేత యాహ్యా సిన్వార్ ప్రకటించారు. ఇజ్రాయెల్ జైళ్లలో బందీగా ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే తమ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడిచిపెడతామని హమాస్ ప్రకటించింది. గాజాలో భూతల దాడులను ఇజ్రాయిల్ ఉధృతం చేసి గాజా యుద్ధభూమిగా మారిందంటూ ప్రకటించిన నేపథ్యంలో హమాస్ ఈ డిమాండ్ చేసింది.