గుజరాత్లో ఓ నకిలీ ఆఫీస్ ఏర్పాటు చేసి రూ.4.16 కోట్ల ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్, అబు బకర్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భోగస్ ప్రాజెక్టులకు ప్రభుత్వ నిధులు పొందేందుకు బొదేలీ పట్టణంలో సందీప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేరుతో నకిలీ కార్యాలయం ఏర్పాటు చేశారు. పలు ప్రాజెక్ట్‌ల ద్వారా రూ.4.16 కోట్ల నిధులు కొల్లగొట్టారు.