గ్రామ వాలంటీర్ 20 రోజుల పాటు వివాహితపై లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పని చేసే ప్రదేశం నుంచి బలవంతంగా తీసుకెళ్లి, ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివాహిత పట్ల గ్రామ వాలంటీర్ దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను బెదిరించి, బలవంతంగా ఓ గదిలో బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు కూతురు ఎదుటే తన కామవాంఛ తీర్చుకున్నాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.