చిత్తూరులో నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సుయాత్ర ఏర్పాట్లపై శనివారం నగరంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మురకంబట్టు మీదుగా కట్టమంచి లోని కళ్యాణ మండపం వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. అక్కడ విద్యావేత్తలతో సమావేశం తర్వాత గాంధీ విగ్రహం వరకు యాత్ర వెళుతుందని వెల్లడించారు. యాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.