కేంద్ర ప్రభుత్వ పధకాలు సక్రమంగా అమలు చేయడానికి , పర్యవేక్షించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో అయోధ్య రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, పాల్గొన్నారు.