ప్రతివార్డు సచివాలయం పరిధిలో పల్లెకు పోదాం కార్యక్రమ విజయవంతానికి కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని, నగరపాలక సంస్థ కమిషనర్ పివికె భాస్కర్ అన్నారు. కార్యక్రమ నిర్వహణపై శనివారం నగరపాలక సంస్థ కాన్ఫెరెన్స్ హాలులో సచివాలయ కార్యదర్శులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 9 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని వార్డ్, గ్రామ సచివాలయాల్లో పల్లెకు పోదాం కార్యక్రమం అమలుచేస్తుందన్నారు.