మహారాష్ట్రలో అధికార శివసేన కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా ఎంపీ హేమంత్ పాటిల్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు పాటిల్ తెలిపారు.