విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. కంటకాపల్లి రైల్వేజంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల పేర్లు కంచుబారిక రవి, గిరిజాల లక్ష్మి, బలరామ్, అప్పలనాయుడు, కాపు శంభం, చల్ల సతీష్, పెనుమర్రి గౌరినాయుడుతోపాటు పలాస ప్యాసింజర్ రైలు గార్డ్ ఎం.ఎస్.రావు, రాయగడ రైలు ఇంజిన్లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మృతి చెందారు.