విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘనట స్థలానికి సీఎం జగన్ రానున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్య వేక్షించనున్నారు. అక్కడే అధికారులు, మంత్రులతో సమావేశమై ప్రమాదంపై ఆరా తీయనున్నారు. రైలు ప్రమాద సంఘటన స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జయిన ప్యాసింజర్ బోగీలను, గూడ్స్ భోగిలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.