విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం దిగ్ర్భాంతికి గురి చేసింది. అమ్మవారి పండగవేళ ఆప్తుల క్షేమసమాచారం కోసం ప్రజలు అల్లాడిపోయారు. ఈ ప్రమాదంలో అధికారికంగా 13మంది మృతి చెందగా, అనధికారికంగా ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య అధికారికంగా 54గా వెల్లడిస్తున్నా, అనధికారికంగా 100కు మించినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఇప్పటివరకు 11మంది మృతదేహాలను గుర్తించారు.