విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నతస్థాయి విచారణ చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రంజీవ్ సక్సేనా విశాఖకు చేరుకున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం ప్రమాదస్థలాన్ని పరిశీలించనున్నారు. హైటెన్షన్ వైర్లు తెగిపోవడంతోనే పలాస రైలును ఆపేశారా? సిగ్నలింగ్ లోపమా, అదే ట్రాక్ పైకి రాయగడ రైలుకు ఎలా అనుమతిచ్చారనే అనే అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నారు.