సాధారణంగా ఓ రైలు ఒక స్టేషన్ నుంచి వెళ్లి, తర్వాత స్టేషన్ దాటేవరకు. వెనక వచ్చే రైలుకు సిగ్నల్ ఇవ్వరు. కంటకపల్లి దాటివెళ్లి కొంత దూరం వెళ్లాక భీమాలి సమీపంలో పలాస ప్యాసింజర్ ఆగిపోయింది. అది తర్వాత స్టేషన్ అయిన అలమండకు చేరలేదు. దీంతో వెనుక వస్తున్న రాయగడ ప్యాసింజర్ కంటకపల్లి స్టేషన్ వద్ద ఆగాలి. కానీ అది ఎలా ముందుకు వెళ్లిందనేది ప్రశ్నార్థకంగా మారింది.