విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం జగన్కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను సీఎం తెలియజేశారు. సహాయ బృందాలను వెంటనే ఘటనాస్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఘటనాస్థలానికి మంత్రి బొత్సను పంపించామని, స్థానిక కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు.