పెదకాకాని మండలంలోని పాతూరు ప్రాంతంలో ఆదివారం ఐదుగురు అయ్యప్ప మాల ధరించి భక్తులుగా చెబుతూ ఇంటింటికి వెళ్లి పూజలు చేస్తామని, ఆలయం నిర్మించాలని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వారి వేషధారణ, మాటలు మార్పులు గమనించిన స్థానికులు పెదకాకాని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా 75 తాళ్లూరు కు చెందిన సాయి, ఏడుకొండలు, దానియేలు, బ్రహ్మం, శ్రీలుగా గుర్తించారు.