జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం సోమవారం తెనాలి పట్టణంలోని పాండురంగ పేటలోని షాదీఖానాలో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. జశ్వంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 31వ సచివాలయం పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించటం జరుగుతుందన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్ క్యాంప్ కొనసాగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.