గుంటూరు జిల్లా పొన్నూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో నేడు సోమవారం యధావిధిగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసిందని తాసిల్దార్ తెలిపారు.