గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలోని జడ్పీ పాఠశాలలో జగనన్న ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీడీవో రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొని చికిత్సలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.