చుండూరు మండల పరిధిలోని దిండిపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వివిధ రంగాల్లో పెద్దపీట వేశారన్నారు. పేదల పక్షాన పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు.