ప్రభుత్వ భూమి కోసం రెండు వర్గాలు దాడి చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. దొప్పెర్లలో సర్వే లో 185/2లో ఉన్న 1. 50ఎకరాల గెడ్డపోరంబోకు కోసం ఆ గ్రామానికి చెందిన కొందరు కొంతకాలంగా ఘర్షణ పడ్డారు. ఈ భూమిలో ఒకవర్గానికి చెందిన వారు 3రోజుల క్రితం స్తంబాలు వేయడంతో మరో వర్గం అభ్యంతరం చెప్పింది. ఈ ఘర్షణ ముదిరి కొట్లాటకు దారితీసింది. కొల్లి కాంతం ఫిర్యాదు మేరకు ఐదుగురిపైనమోదు చేశామని ఎస్సైనాయుడు తెలిపారు.