చంద్రగిరి మండల పరిధిలోని స్వర్ణముఖి నది ఒడ్డున వెలసి ఉన్న రుద్ర పాదాల ముక్కోటి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఆది దంపతులైన శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వర స్వామి వారి కళ్యాణం కనులు విందుగా నిర్వహించారు. ప్రధాన అర్చకుల బృందం వేకువ జామున స్వామివారిని, అమ్మవారిని మేల్కొలిపి నిత్య పూజలు చేసి, సాయంత్రం ఆనందవల్లి దేవికి, అగస్తేశ్వర స్వామి వారికి వేదమంత్రాలతో కళ్యాణ తంతును నిర్వహించారు.