అచ్చంపేట మండలంలోని పెద్దపాలెం గ్రామానికి చెందిన పల్లవి ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది. సోమవారం ఆయన తండ్రి వెంకట్రావుకు రెండు లక్షల చెక్కును పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు తన కార్యాలయంలో అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.