ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. సోమవారం రేపల్లెలోని ఎంపీ కార్యాలయంలో కొలుసు రమాదేవికి మూడు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయని పథకం చెక్కును అందజేశారు. పార్టీ నాయకులు సమక్షంలో రమాదేవికి చెక్కు అందజేయగా ముఖ్యమంత్రి జగన్ , ఎంపీ మోపిదేవికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.