రామగిరిలో మండలంలో గ్రామ వాలంటీర్ గా పని చేస్తోన్న రాజేష్ ఇంటిలో ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. అన్నదమ్ముల నుంచి వేరు అయినప్పుడు రూ. 4 లక్షలు అప్పు పంచుకున్నాడు. అప్పులు ఎలా తీర్చాలని తరచు మనోవేదనకు గురయ్యే వాడని వెల్లడించారు. మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa