కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన తప్పెట వెంకటేష్ గౌతమి దంపతుల కుమార్తె మెర్సీ ఓ విందు కార్యక్రమంలో వంటశాల వద్దకెళ్లి ప్రమాదవశాత్తు వేడి సాంబారు పాత్రలో పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురంలోని సర్వజనా ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కు తరలించగా వారం పైగా చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతూ ఆదివారం మృతి చెందింది.