రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 27వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రకటించగా అవన్నీ ఆన్లైన్లోకి ఎక్కినప్పటికీ, ఒక పర్చూరు నియోజకవర్గం జాబితా మాత్రం సోమవారం వరకు ఆన్లైన్ కాలేదు. పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి దాదాపు 30 వేల క్లెయిమ్స్ రాగా వాటి విచారణ ప్రక్రియ బాగా సమయం తీసుకోవడంతో పాటు దస్త్రాల మీద అధికారులు సంతకం చేయడం ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.