ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మిర్చి పంట ఎండిపోతు ఉండడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు అంటున్నారు. ఎకరాకు పాతికవేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి పంటలు వేశామని వర్షాలు సరిగా పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అంటున్నారు. పంటలు ఎండిపోయి నష్టపోయే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.