గూఢచర్యం కేసులో 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష విధిస్తూ ఖతార్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ వెల్లడించారు. బాధిత కుటుంబాలను సోమవారం కలిశానని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ కష్టకాలంలో అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.