విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని సీఎం జగన్ పరిశీలించాలనుకున్నారు. కాగా ప్రమాద స్థలానికి ప్రస్తుతం సీఎం జగన్ వెళ్లడంలేదు. రైల్వే అధికారుల సూచనల మేరకు విశాఖ, విజయనగరంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. కాగా ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. చాలా మంది వరకు గాయపడ్డారు.