విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం ఘటనలో బాధితుల బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు.. వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొందని చెప్పారు.