విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమని, బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను టీడీపీ బృందం సభ్యులు పరామర్శించి అండగా నిలుస్తారన్నారు.