దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లకు చదువుతో సంబందం లేకుండా ప్రజలు మోసపోతున్నారు. తాజాగా ముంబైలోని శాంతాక్రజ్‌లో నివసించే డాక్టర్ జంట నుంచి స్కామర్లు రూ. 90,000 కొట్టేశారు. హరీష్ బెదెకర్ ఆయన భార్య ప్రాచీ విద్యా సంస్ధల్లో కౌన్సెలింగ్ లెక్చర్స్ ఇస్తుంటారు. వీరికి ఓ కౌన్సెలింగ్ సెషన్ సందర్భంగా ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సంతోష్ కుమార్ అనే వ్యక్తి డిజిటల్ పేమెంట్ చేస్తామని చెప్పి స్కామ్‌కు తెరలేపాడు.