ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా ఆక్రమిత ప్రాంతంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కాల్చివేశారు. ఇందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన వోల్నవాకా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఇళ్లు ఇవ్వలేదనే కోపంతో రష్యా సైనికులు ఆ కుటుంబాన్ని కాల్చివేసి ఉంటారని ఉక్రెయిన్ తెలిపింది.