స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్ కోరారు. విచారించిన హైకోర్టు 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు కోర్టు వాయిదా వేసింది. 53 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.