స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ వచ్చింది. నవంబర్ 28న సరెండర్ కావాలని జడ్జి ఆదేశించారు. ప్రధాన బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ 10న హైకోర్టులో జరగనుంది. సెప్టెంబర్ 9న చంద్రబాబు నంద్యాలలో అరెస్టయ్యారు. 53 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. నేడు సాయంత్రానికి చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.