అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం దృష్టి సారిస్తున్నామని కారంపూడి ఎస్సై రామాంజనేయులు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ. రౌడీ షీటర్లు, సస్పెక్టెడ్ నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు రాకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనకాడబోమని తెలిపారు