దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలో జరుగుతున్న పనుల నేపథ్యంలో గుంటూరు డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్రోణాచలం-గుంటూరు(17227), కాచిగూడ-గుంటూరు(17252) రైళ్లను ఈనెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు.