నవంబర్ 1వ తేదీ నుంచి 15 లోగా రేషన్ పంపిణీ పూర్తి చేయాలని తహసీల్దార్ కె. రవిబాబు సూచించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం మండల పరిధిలోని ఎండీయూలు, రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూడాలని, ఎవరికీ ఇబ్బంది లేకుండా సకాలంలో రేషన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు.