కార్తీకమాసం ప్రారంభం నేపథ్యంలో వచ్చేనెల 18 నుంచి పంచారామాలకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి రవికాంత్ తెలిపారు. ఎన్టీఆర్ బస్టాండ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం శైవక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి శని, ఆదివారం రాత్రి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.