గుంటూరు ప్రాంతానికి చెందిన అత్తలూరి సాంబశివరావు, సుజాత దంపతులు కుటుంబ సమస్యల నేపథ్యంలో సోమవారం చేబ్రోలు ప్రాంతంలోని కొమ్మమూరు ఛానల్ కాలువగట్టుపై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వ్యవసాయ సిబ్బంది పొలాలను పరిశీలించేందుకు వెళ్ళగా గమనించి భార్య సుజాతను అంబులెన్స్ లో పొన్నూరు వైద్యశాలకు తరలించారు. భర్త ఆచూకీ తెలియలేదు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.