నెరలవలస లో మంగళవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి కాలిన గాయాలతో మృతి చెందాడు. స్థానికులు భీమిలి పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు కొనఊపిరితో ఉన్నప్పుడు ఒడియా బాష మాట్లాడాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతుని వివరాలకు భీమిలి పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు. ఎస్సై తాతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని వయస్సు సుమారు 45 ఉంటుంది.