తెదేపా సీనియర్ నాయకుడు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో చాలాకాలంగా గుడివాడ పట్టణంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. నిత్యం ఏదో ప్రాంతంలో వందల మంది పేదలకు అన్నం పెడుతున్నారు. ఈ క్యాంటీన్ నిర్వహణతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందని, న్యూసెన్స్ జరుగుతోందని మున్సిపల్ ఉద్యోగి కైకాల వెంకట శివచంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.