తెనాలి మండలాల రైతులు తుంగభద్ర డ్రెయిన్‌లో పదుల సంఖ్యలో మోటార్లు వేసి సమీపంలోని కాలువకు మంగళవారం నీరు తోడుతున్నారు. పంట కాలువను పొక్లెయిన్‌తో రైతులే బాగు చేసుకుని సమీప పంట పొలాలకు మోటార్లు పెట్టి పైపుల ద్వారా మురుగు నీరు తరలిస్తున్నారు. ఒక్కో ఎకరా తడికి రూ. 5వేల నుంచి రూ. 8వేలు రైతులు పోగు చేసుకుని ఇలా రూ. లక్షలు ఖర్చు చేసి పంట తడపాల్సి వస్తోంది.