దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న విషాదాన్ని మరువక ముందే తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ సమీపంలో సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గత రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇంజిన్ సహా మరో రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణలపై ఆరా తీస్తున్నారు.