తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని కొందరు విపక్ష ఎంపీలు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు ఎంపీలు చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. యాపిల్ సంస్థ సుమారు 150 దేశాల్లో వార్నింగ్ నోటిఫికేషన్లు జారీ చేసిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు.