రాష్ట్ర బార్ కౌన్సిల్ మొండి వైఖరిని నిరసిస్తూ ఈనెల 15 వరకు విధులు బహిష్కరిస్తున్నామని ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించిన అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ. రూ. 20తో న్యాయవాదుల సంక్షేమనిధి స్టాంపును అతికించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.